హరోంహర..కొత్త ఓటీటీ డేట్!

34
- Advertisement -

నైట్రో స్టార్ సుధీర్ బాబు18వ చిత్రానికి యూత్ ఫుల్ ఎంటర్‌ టైనర్ సెహరితో ఆకట్టుకున్న ట్యాలెంటడ్ దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. తన రెండవ సినిమా కోసం భారీ కాన్వాస్‌ తో కూడిన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు దర్శకుడు. ఎస్‌ ఎస్‌ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.

జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యాన్ని అందుకుంది, సుధీర్‌బాబుకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టగా తొలుత ఓటీటీ డేట్‌ని అనౌన్స్‌చేయగా అనుకోని కారణాల వల్ల వాయిదాపడింది. తాజాగా కొత్త ఓటీటీ డేట్ లాక్ అయింది. జూలై 18వ తేదీన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ప్ర‌ణీత్ హ‌నుమంతు ఈ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టించగా 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.

Also Read:కమిటీ కుర్రోళ్ళు…లిరిక‌ల్

- Advertisement -