వరల్డ్ కప్ విజయానికి గుర్తుగా!

9
- Advertisement -

వరల్డ్ కప్ విజయానికి గుర్తుగా టీమిండియా మహిళ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ చేతిపై టాటూ వేయించుకున్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో గెలుపొందిన నేపథ్యంలో చేతిపై టాటూ వేయించుకున్నారు.

గెలిచిన సంవత్సరానికి గుర్తుగా 2025తో పాటు కప్‌ను టాటూ వేయించుకున్నట్లు వెల్లడించారు హర్మన్. తన కొత్త టాటూ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన హర్మన్.. ఇది తన జట్టు సాధించిన చారిత్రాత్మక విజయానికి శాశ్వత గుర్తుగా నిలుస్తుంది అని తెలిపింది.

నవీ ముంబయిలోని DY పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో — షఫాలి వర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు దీప్తి శర్మ ఐదు వికెట్లు తీయడంతో — భారత్ ఘన విజయాన్ని అందుకుంది, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Also Read:కొండా వ్యాఖ్యలపై కార్తీక్ రెడ్డి సెటైర్

- Advertisement -