గురుభక్తి చాటుకున్న హర్మన్!

11
- Advertisement -

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ 2025 టైటిల్‌ను గెలుచుకుంది భారత మహిళల జట్టు. తొలిసారి విశ్వకప్‌ను హర్మన్‌ ప్రిత్ కౌర్‌ కెప్టెన్సీలో గెలవగా ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే టైటిల్ గెలిచిన వెంటనే హర్మన్ చేసిన పనికి ఇప్పుడు అంతా ఫిదా అవుతున్నారు.

తన గురు భక్తిని చాటుకుంది హర్మన్‌ప్రీత్‌ కౌర్‌. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మరాయి. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో తన గురువు అమోల్ మజుందార్‌కు పాదాభివందనం చేశారు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.

హర్మన్‌ప్రీత్ చివరి వికెట్‌గా దక్షిణాఫ్రికా బ్యాటర్ నాడిన్ డి క్లర్క్ క్యాచ్ పట్టి, ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను 246 వద్ద ముగించిన కొద్దిసేపటి తర్వాత జరిగింది. భారత్ 299 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడి, తమ మొదటి మహిళల వన్డే వరల్డ్ కప్ కిరీటాన్ని సాధించింది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్, కపిల్ దేవ్ మరియు ఎంఎస్ ధోనీ తర్వాత వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన మూడవ భారత కెప్టెన్‌గా నిలిచారు.

ఈ విజయానికి సమిష్టి జట్టు ప్రదర్శనే కారణమైంది — షఫాలి వర్మ చేసిన వేగవంతమైన 87 పరుగులు, దీప్తి శర్మ మధ్య ఓవర్లలో చూపిన స్థిరమైన ఆట, అలాగే ఈ ఇద్దరూ బౌలింగ్‌లోనూ కీలక పాత్ర పోషించడం గమనార్హం.

Also Read:అనిల్‌ అంబానీకి బిగ్ షాక్‌..!

- Advertisement -