రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్ అధికారులు 2017 తెలంగాణ ఎక్సలెన్స్ పురస్కారాలకు ఎంపికయ్యారు. అందించనుంది. పంద్రాగస్టు సందర్భంగా అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందచేయనుంది ప్రభుత్వం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో వివిధ హోదాల్లో… ప్రజలకు విశేష సేవలందిస్తున్న సివిల్ ఉద్యోగులను హరిత మిత్ర అవార్డుతో సత్కరించనుంది ప్రభుత్వం.
జనగామ జిల్లా కలెక్టర్ దేవసేన, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఇద్దరు ఐఏఎస్ లు ఆర్వీ కర్ణన్, అనురాగ్ జయంతీ, హెచ్ఎమ్డీఏ కమిషనర్ టీ చిరంజీవులు,నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణాకు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఏ. మురళికి, డీఎంహెచ్ఓ అయ్యప్ప, జగిత్యాల కలెక్టర్ శరత్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రాంరెడ్డికి, కొత్తగూడెం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,సూర్యాపేట కలెక్టర్ సురేంద్ర మోహన్, వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ ,నల్గొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తోపాటు మరికొందరికి పురస్కారాలు అందించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో వివిధ హోదాల్లో… ప్రజలకు విశేష సేవలందిస్తున్న సివిల్ ఉద్యోగులను హరిత మిత్ర అవార్డుతో సత్కరించనుంది ప్రభుత్వం. ఈ అవార్డులను మొత్తం 55 మందికి ఇవ్వనున్నట్లు అవార్డు కమిటీ చైర్మన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య ప్రకటించారు. ప్రభుత్వం ఇవ్వనున్న ఈ అవార్డులు రాష్ట్ర స్థాయిలో ఐదు, జిల్లాల స్థాయిలో యాభై అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిల్లో కేటాయించిన యాబై అవార్డుల్లో… ప్రజా ప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, పట్టణ గ్రామీణ పరిపాలనా సంస్థల అధికారులు ఉండనున్నట్లు తెలిపారు. మొత్తం ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసిన 55 మంది అధికారులకు ఆగష్టు 15.. పంద్రాగష్టు రోజున ‘హరిత మిత్ర’ అవార్డులు అందించనున్నట్లు వెల్లడించారు.