ఉపాధిహామీతో హరితహారం అనుసంధానం..

352
haritha haram
- Advertisement -

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జూలై రెండో వారంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

హరితహారం కార్యక్రమాన్ని ఉపాధిహామీకి అనుసంధానం చేయటంతో కూలీలకు మెరుగైన ఉపాధి లభించే అవకాశం ఉందని.. వర్షాలు మొదలుకాగానే గుంతలు తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నట్టు పంచాయతీరాజ్‌శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బీ సైదులు చెప్పారు.

ఇందుకోసం 12,738 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచింది. గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్‌ను అందజేయడం హరితహారానికి ఎంతో మేలు చేస్తుందని.. సర్పంచ్‌లు ట్రాక్టర్‌ను ట్యాంకర్‌గా వాడి మొక్కలకు నీళ్లు పోయడం ద్వారా హరితహారం కార్యక్రమంతో మొక్కలను కాపాడుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

- Advertisement -