కోటిమొక్కలతో సింగరేణిలో హరితహారం ప్రారంభం..

459
haritha haram
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంపై సింగరేణి కాలరీస్ కంపెనీలో తెలంగాణాకు హరితహారం కార్యక్రమంలో ఈ ఏడాది కూడా కోటి మొక్కలు నాటాలన్న సంకల్పంతో ఏరియాల వారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నారు. సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ ఆదేశంపై శ్రీరాంపూర్ ఏరియాలో జూలై 20వ తేదీ నాడు 25 వేల మొక్కలు నాటి హరితహారాన్ని ప్రారంభించిన కంపెనీ, మంగళవారం (జూలై 23వ తేదీ) నాడు మందమర్రిలో 55 వేల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా తొలిరోజు 2,500 మొక్కలను ఆర్.కె.పి.ఓ.సి. గని ప్రాంగణంలో నాటారు.

50 హెక్టార్లలో 55 వేల మొక్కలు నాటే బృహత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ.. తెలంగాణాకు హరితహారం కార్యక్రమాన్ని సింగరేణిలో విజయవంతంగా అమలు జరుపుతున్న యాజమాన్యాన్ని అభినందించారు. సింగరేణి సంస్థ మంచిర్యాల, క్యాతన్పల్లి, నస్పూర్ మున్సిపాలిటీలలో మొక్కలు నాటడమే కాక రెండు సంవత్సరాల పాటు వీటి సంరక్షణ బాధ్యత తీసుకోవడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్ధులు హరితహార సందేశాన్ని తాము పాటించడమే కాక భావితరాలకు అందిస్తామన్నారు. జి.ఎం. రమేష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణాకు హరితహారంలో భాగంగా ఇప్పటివరకూ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం 2,500 మొక్కలను ఓ.సి. గని ప్రాంగణంలో నాటారు. ఇప్పటి నుండి వరుసగా 3 రోజులలో 55 వేల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయనున్నామని మందమర్రి జి.ఎం. రమేష్ రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సునీత, ఎస్వోటు జి.ఎం. వెంకటేశ్వర్లు, సి.ఎం.ఓ.ఎ.ఐ. అధ్యక్షులు జక్కరెడ్డి, టి.బి.జి.కె.ఎస్. వైస్ ప్రెసిడెంట్ యం.సంపత్, ఎ.ఐ.టి.యు.సి. నాయకులు అక్బర్ అలీ, ఎ.జి.ఎం. (ఎఫ్&ఎ) ఆంథోనిరెడ్డి, డి.జి.ఎం. (ఇ&ఎం) జగన్ మోహన్ రావు, ఆర్.కె.పి.ఓ.సి. ప్రాజెక్టు ఆఫీసర్ మధుసూధన్, డి.జి.ఎం. (సివిల్) గోవిందప్ప, ఇంచార్జ్ (పి.ఎం) శ్యాంసుందర్, ఫారెస్టు అధికారి రమణరెడ్డి, ఎస్టేట్ అధికారిణి నవనీత, ఐ.ఇ.డి. రాజన్న, డి.వై.పి.యం. రెడ్డిమల్ల తిరుపతి, ఎస్.ఎస్.ఓ. మురళీకృష్ణ, మరియు అన్ని గనులు, డిపార్టుమెంట్ల అధికారులు యూనియన్ నాయకులు, విద్యార్ధిని విద్యార్ధులు, సేవా సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -