ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం భూగోళం పర్యావరణ సంక్షోబాన్ని ఎదుర్కొంటున్నారని, స్వచ్చమైన ప్రాణవాయువు దొరకక పరితపిస్తున్నామని ఆయన వాపోయారు. ఈ విధమైన దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగమించగలమని మంత్రి ఆన్నారు. పర్యావరణ పరిరక్షణకు మించిన సంపద లేదని, ప్రస్తుత కరోనా సమయంలో ఈ విషయం రుజువైందని ఆయన అన్నారు.
భవిష్యత్తు తరాలకు ఆరోగ్యమైన వాతావరణం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. నాసిరకం ప్లాస్టిక్ వాడుకంమీద నియంత్రణ విధమైన రాష్ట్ర ప్రభుత్వం-గ్రీన్ కవరేజి కొరకు హరితహరం వంటి పథకాలను పటిష్టంగా అమలు చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం అమలు చేస్తున్న పల్లెప్రగతి, పట్టణాల అభివృద్ది కోసం అభివృద్ది కోసం అమలు చేస్తున్న పట్టణ ప్రగతి, ఇతర కార్యక్రమాలు పర్యావరణాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జీవన వైవిధ్యంతో కూడిన ఆకుపచ్చని తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.