ఆగస్టు 1న హరిత పండుగ: సీఎం కేసీఆర్

238
kcr
- Advertisement -

ఆగస్టు 1న గజ్వేల్‌లో లక్షా 116 మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతిభవన్‌లో మంత్రులు,ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్…గజ్వేల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు,విద్యార్థులు,మహిళలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఆగస్టు 1న గజ్వేల్‌ పట్టణంలోని అన్ని మసీదుల్లో ఒకేసారి సైరన్ మోగాలని..సైరన్ మోగిన వెంటనే అంతా మొక్కలు నాటాలని చెప్పారు. నాటిన మొక్కలను బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రోడ్ల పక్కన నాటే మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. మొక్కలు పెంచడంలో బాగా శ్రద్ద చూపిన వారికి అవార్డులు అందించాలని దిశానిర్దేశం చేశారు. పిచ్చిమొక్కలను తీసేసి మంచి మొక్కలను మాత్రమే పెంచాలన్నారు. ప్రజలకు ఇచ్చే చెట్లలో ఖచ్చితంగా పండ్ల చెట్లు, పూల చెట్లు కూడా ఉండాల సీఎం అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో మంత్రులు జోగు రామన్న, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పిసిసిఎఫ్ పి.కె.ఝా, ఎపిసిసిఎఫ్ డోబ్రియాల్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -