పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఏం తక్కువ చేశామని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ నుండి వెళ్లిపోయినా బీఆర్ఎస్‌కు వచ్చే నష్టమేమి లేదని స్పష్టం చేశారు. పటాన్‌చెరులో మీడియాతో మాట్లాడిన హరీష్….వైఎస్ హయాంలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని గుర్తు చేశారు.
మహిపాల్‌రెడ్డిని మూడుసార్లు ఎమ్మెల్యేను చేసిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు గుండె ధైర్యంతో ఉన్నారని …పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టామన్నా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలను లాక్కొవడం సరికాదన్నారు.
కాంగ్రెస్ నేతలే మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని… నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన మహిపాల్‌రెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. కాటా వర్గానికి చెందిన నాయకులు బాహాటంగానే మహిపాల్‌రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు హరీష్.
Also Read:బచ్చల మల్లి .. ఫోక్ మెలోడీ