- Advertisement -
జహిరాబాద్ జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో కొలువైన సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజనీ, స్వయంభూ వినాయకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఆలయ అభివృద్ధికి రూ.50లక్షల విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఇక అంతకముందు ఆలయానికి చేరుకున్న హరీశ్‌కు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.
- Advertisement -