మాజీ సీఎం కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు.. కేసీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, జై తెలంగాణ యుద్ధ నినాదం, తెలంగాణ సమున్నత అస్తిత్వం అన్నారు.
నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ. నాకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించి, నాలో ప్రజా సేవా సంస్కారాన్ని రంగరించి, నన్ను ఉద్యమ కార్యాచరణలో నడిపించి.. నాలోని నాయకత్వ గుణాన్ని ప్రేరేపించి, నాకు పరిపాలనా సామర్థ్యాన్ని కల్పించి, నన్ను చరితార్థుణ్ణి చేశారని తెలిపారు.
కేసీఆర్ తెలంగాణ ఉద్వేగం
కేసీఆర్ తెలంగాణ ఉద్రేకం
కేసీఆర్ తెలంగాణ స్వాభిమానం
కేసీఆర్ జై తెలంగాణ యుద్ధ నినాదం
కేసీఆర్ తెలంగాణ సమున్నత అస్తిత్వం
కేసీఆర్ తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం
కేసీఆర్ తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం
కేసీఆర్ తెలంగాణ అనురాగాల అమృతత్వం
కేసీఆర్ తెలంగాణ ప్రజాగళం… pic.twitter.com/JznYJ8Sgq2— Harish Rao Thanneeru (@BRSHarish) February 16, 2025
Also Read:హ్యాపీ బర్త్ డే…బాపు కేసీఆర్

