దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొండపాక మండలం మర్పడ్గ గ్రామంలో వెలసియున్న శ్రీ విజయ దుర్గా సమెత శ్రీ సంతాన మల్లిఖార్జున దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు.. ఈ బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని తెచ్చిన పండుగ ఇది అన్నారు. ప్రపంచంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉంది… తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో, తెలంగాణ రాష్ట్ర సాధనతో తెలంగాణ పండుగలు విశ్వవిఖ్యాతమయ్యాయి… తెలంగాణ ఆడబిడ్డలు అందరూ ఈ పండుగని చాలా గొప్పగా జరుపుకుంటున్నారు అన్నారు.
తెలంగాణ వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా చాలా గొప్పగా జరుపుకుంటున్నారు.. బతుకమ్మ పండుగ ప్రకృతిని పూజించే పండుగ. మన అక్క చెల్లెల్లు ఆటపాటలతో పూలను పూజించి చెరువులో కలుపుతారు. ..ఈ పండుగ వెనుక సైన్స్ కూడా ఉంది. కొత్తగా వచ్చిన వర్షపు నీటిలో కీటకాలు ఉంటాయి. వాటిని శుభ్రం చేయడానికి మనం తంగేడు పువ్వు, గునుగు పువ్వులను నీటిలో వేయడం వల్ల నీళ్ళు పరిశుభ్రమవుతాయి అన్నారు. పూర్వం మన పెద్దలు ఎంత గొప్పగా ఆలోచించారో ఈ పండుగ చూస్తే అర్థమవుతుంది… బతుకమ్మ అప్పుడు ఆడపడుచులు తల్లిగారి ఇంటికి రావడం, అక్కడ పాటలు పాడడం లాంటి గొప్ప అనుభూతి ఉంటుంది… కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు ఈ బతుకమ్మకు చాలా గొప్ప గుర్తింపు వచ్చింది అన్నారు.
Also Read:స్థానిక సంస్థల ఎన్నికలు..పూర్తి వివరాలు

