అమెరికాలో దుండగుడి కాల్పులో హైదరాబాద్ యువకుడు పోలే చంద్రశేఖర్ మృతి చెందారు. దుండగుడి కాల్పుల్లో మరణించిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
ఎల్బీ నగర్‌లోని చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి.. చంద్రశేఖర్ పార్థీవదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.
టెక్సాస్‌లో డెంటల్ సర్జరీలో మాస్టర్స్ చదువుతూ, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు పోలే చంద్రశేఖర్(27). గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పని చేస్తున్న సమయంలో పోలే చంద్రశేఖర్‌పై కాల్పులు జరిపాడు దుండగుడు. కాల్పుల్లో పోలే చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా ఎల్బీనగర్‌లోని మృతుడు చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు హరీష్ రావు.
Also Read:జన నాయకన్..ప్రమోషన్స్‌కు బ్రేక్!

