టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు వర్కింగ్ స్టైలే వేరు. తనకు అప్పజెప్పిన పనిని విజయవంతంగా పూర్తిచేయడం కోసం ఎంతగానో కష్టపడే హరీష్ పని రాక్షసుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే హరీష్…తన దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించడంలో ఎప్పుడు ముందుకుంటారు.
ఓ వైపు మంత్రిగా ఉన్నా సిద్దిపేట అభివృద్ధిపై ఎప్పుడు దృష్టిసారించే హరీష్ వారానికి నాలుగు రోజులు ఇక్కడే ఉంటారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నియోజకవర్గంతో పాటు హైదరాబాద్‌లోనూ కొద్ది రోజులు ఉంటున్న హరీష్ రావు… తనను కలవడానికి వచ్చే సిద్దిపేట ప్రజలకు ఓ సూచన చేశారు.
సిద్దిపేట ప్రజలు అత్యవసరమైతే తప్ప తనని కలవడానికి హైదరాబాద్ రావొద్దని సూచించారు. తనని కలవాడానికి వచ్చిన కొంతమందితో హరీష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రోజు ఇక్కడే ఉన్నా… రేపు అక్కడే ఉంటాను. సిద్దిపేట ప్రజలు ఇక్కడికి వస్తున్నారు అంటే.. నేనే ఎక్కడో మీకు సేవ చేయలేకపోతున్నానని అర్థం. ఎక్కడో ఫెయిల్ అయినట్టే అన్నారు.
తనని కలిసేందుకు మబ్బుల ఐదు గంటలకు లేచుంటారు. ఐదువేల రూపాయలతో బండి మాట్లాడుకుని.. టిఫిన్ ఖర్చులు పెట్టుకుని వస్తారు. మీరొచ్చే పనుల్లో రూపాయికి 90 పైసలు కానివి ఉంటాయి. దీంతో రానుపోను పనులు ఖరాబైపోయినట్టే కదా. అంతదూరం వచ్చి పనికాకపోతే మనసు నొచ్చుకుంటుంది. మీ మనసు నొచ్చుకుంటే నా మనసు నొచ్చుకున్నట్టే అని వారికి వివరించారు. ప్రస్తుతం హరీష్‌కు సంబంధించిన నెట్టింట్లో వైరల్‌గా మారగా నెటిజన్లు నాయకుడంటే హరీష్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
https://twitter.com/TRSMedak/status/1188438698745946112