బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్ రావు..

292
harishrao
- Advertisement -

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించగా ఈ నెల 8న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సర్కార్‌. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరుగనుండగా ఆదివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

గతసారి సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి ఆర్ధిక మంత్రి హరీష్‌ రావు శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ఆశించిన స్థాయిలో రాష్ట్రానికి రాబడులు రాకపోవడంతో బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. 1.6 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశబెట్టబోతున్నట్టు సమాచారం.

కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించింది. అటు ఎన్నికల హామీలు నెరవేర్చే విధంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించామంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. 14 లేదా 15 రోజులు ఉభయ సభలు జరిగే అవకాశం ఉంది. సీఏఏ, ఎన్‌పీఆర్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశముంది.

- Advertisement -