సీఎం రేవంత్ రెడ్డినా లేక తాను రాజీనామా చేయాలా అన్నది ప్రజలు తెలుస్తారన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్…ఇంకా 17 లక్షల మందికి మాఫీ చేయాల్సి ఉందని మంత్రి ఉత్తమ్ అన్నారన్నారు.
ఏ దేవుళ్లపై ఒట్లు పెట్టారో ఆ దేవుళ్ల వద్దకు వెళ్లి రేవంత్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాయని చెప్పారు. పాలకుడు పాపం చేస్తే ప్రజలకు అరిష్టం అని బ్రాహ్మణ ఉత్తములు చెప్పారు. అందుకే ప్రజలకు అరిష్టం కలుగకుండా పాపం చేసిన సీఎంను క్షమించాలని మొక్కుకున్నా అన్నారు.
ఇంకా 54 శాతం మంది రైతులకు మాఫీ డబ్బు బ్యాంకుల్లో జమచేయాలి… మరి మంత్రుల లెక్కల ప్రకారం రాజీనామా ఎవరు చేయాలని ప్రశ్నించారు. సీఎం సొంతూరులో మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యం చేశారని విమర్శించారు. రేవంత్ సర్కార్ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. అందరికి రుణమాఫీ చేసేవరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని స్పష్టం చేశారు.
Also Read:Vijay: పార్టీ జెండా,గుర్తును ఆవిష్కరించిన విజయ్