సిద్దిపేటలో తెలంగాణ వేద విద్వన్ మహాసభలు

551
harish rao
- Advertisement -

సిద్దిపేటలో తెలంగాణ వేద విద్వన్ మహాసభలు జరగడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ 19 వార్షికోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి వేద విద్వన్మహా మహాసభలను ప్రారంభించిన హరీష్….నాలుగు రోజులు పాటు జరిగే ఈ సభల ద్వారా సిద్ధిపేట వేదఘోషతో సుభిక్షమవుతుందన్నారు. వేద పరిరక్షణకు ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.

వేదం అభ్యసించిన విద్యార్థులకు ఇక్కడ పరీక్షలు నిర్వహించి పట్టాలు ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. వేద ధర్మాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని …సీఎం కేసీఆర్ స్వయంగా గొప్ప భక్తుడు,ధార్మిక సేవాతత్పరుడన్నారు.

minister harishraoతెలంగాణ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశ్యం తోనే ఆయుత చండీయాగం నిర్వహించారు. తెలంగాణ లోని ప్రాచీన దేవాలయాలయాలను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వ నిధిద్వారా వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచీన దేవాలయాల అర్చకులకు ధూప దీపనైవేద్యం పథకం కింద వేతనాలు అందిస్తున్నామని తెలిపిన హరీష్…నేటి తరం కూడా వేద పరిరక్షణకు కృషి చేయాలి అన్నారు. టెక్నాలజీ మోజులో పడి వేద ధర్మాన్ని మరువ వద్దని…. ధార్మిక, ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.

- Advertisement -