యువత ఆలోచన విధానంలో మార్పురావాలి: హరీష్

633
harish rao
- Advertisement -

యువత తమ ఆలోచనా విధానంలో మార్పు రావాలి.. కష్టపడేందుకు సిద్ధంగా ఉంటే మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట టీటీసీ భవన్‌లో యువశక్తి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఒక అడుగు ముందుకు వేస్తే యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.

ఉన్న చోటనే ఉద్యోగం కావాలంటే బాగుపడమని….హైదరాబాద్ న్యాక్‌ సెంటర్ లో శిక్షణ తీసుకున్న యువతకు 99 శాతం అవకాశాలు ఉన్నాయన్నారు.శిక్షణ పొందిన ప్రతి యువకునికి ఉద్యోగం లభిస్తుందని చెప్పారు.నిర్మాణ రంగం లో మంచి అవకాశాలు ఉన్నాయి..

ప్రతి ఊరి నుండి 50 మంది యువత న్యాక్‌ సంస్థకు శిక్షణకు వెళ్ళాలని సూచించారు. యువత ఏపని చేయడానికయినా సిద్ధంగా ఉండాలన్నారు. భేషజాలు వదిలి పెట్టాలి.. కష్టపడి పనిచేయడానికి ముందుకు వచ్చే యువతకు ..వారి కోరుకున్న విభాగంలో శిక్షణ నిచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు.

- Advertisement -