గర్బిణులు పౌష్టికాహారం తీసుకోవాలి:హరీష్

17
- Advertisement -

సిద్దిపేట విపంచి కళానిలయంలో శ్రీ రామకృష్ణ సేవాసమితి గర్భిణీ స్త్రీలకు నిర్వహించిన శిక్షణ -అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గర్భిణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉన్నది. అమ్మలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారన్నారు.

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. సిజేరియన్‌లో కాకుండా నార్మల్ డెలివరీలో పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మొదటి గంట తల్లిపాలు పిల్లలకు అమృతంలో సమానం…. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గర్భిణులకు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశాం. సమాజ హితం కోసం అంకిత భావంతో పనిచేస్తున్న రామకృష్ణ మఠం నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యావాదాలు తెలిపారు హరీష్‌.

Also Read:ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్

- Advertisement -