కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని…దీనిని వదిలించేందుకే రైతు దీక్షలు చేపట్టామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి పట్టణంలో బీఆర్‌ఎస్ రైతుదీక్షలో పాల్గొన్న హరీష్… మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని…అన్నదాతలు చనిపోతున్నా ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం కోల్పోయిందని… కాంగ్రెస్ రాకతో మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని, మోటర్లు కాలిపోతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు పుట్టెడు కష్టాలు వచ్చాయని…. కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మాని రైతులకు సాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని ఎద్దేవాచేశారు.
Also Read:Congress:కాంగ్రెస్ జన జాతర సభ