Harishrao:కష్టపడి పనిచేయండి..అధికారం మనదే

12
- Advertisement -

గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో మాట్లాడిన హరీష్..2009 లో మనకు పది సీట్లే వచ్చాయి ..ఇక పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా ? అన్నారు. ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే…భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దు .భవిష్యత్ లో వచ్చేది మళ్ళీ మనమే..కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావలా వంతుకు మీంచి అమలు చేయలేరన్నారు. మల్కాజ్ గిరి లో పోయిన సారి రేవంత్ తక్కువ ఓట్లతో గెలిచారని,రేవంత్ నియోజకవర్గాన్ని ఎపుడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

ఒక్క పైసా నిధులు తేలేదు…సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం లో ఈ సారి మనం గెలిచి సత్తా చాటాలన్నారు. మల్కాజ్‌గిరిలో ఏడింటికి ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచాం ..ఇపుడు కూడా ఎంపీ సీటు గెలవాలన్నారు. ఇది పరీక్షా సమయం .మనం పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలన్నారు. కర్ణాటక లో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ అభాసు పాలైందని, అక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయన్నారు.

ఇక్కడ కూడా కాంగ్రెస్ కు కర్ణాటక లాంటి పరిస్థితే ఉంటుందని…పార్లమెంటు ఎన్నికల కోడ్ లోపే కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలన్నారు. కోడ్ బూచీ చూపి హామీల అమలును కాంగ్రెస్ వాయిదా చేయాలని చూస్తోందని….గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అబద్దాలు ప్రచారం చేసి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలిచిందన్నారు. ghmc ఎన్నికల్లో బీజేపీ గెలుపు పాలపొంగు లాంటిదేనని అసెంబ్లీ ఎన్నికల్లో నగర ఓటర్లు నిరూపించారని….ఇపుడు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికల కన్నా భిన్నంగా ఉంటాయన్నారు. కీలకమైన పార్లమెంటు ఎన్నికల్లో మీరు కష్టపడి పని చేయాలి
..కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారం లో కొనసాగి మళ్ళీ అధికారం లోకి రావడం అరుదు అన్నారు. రాజస్థాన్ లో ఛత్తీస్ ఘడ్ లో ఐదేళ్లకే కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని…కొన్ని చిన్న చిన్న కారణాలతోనే బీ ఆర్ ఎస్ ఓడిపోయిందన్నారు. కార్యకర్తల సూచనలు పరిగణనలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేస్తాం అని…కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు అయ్యాయన్నారు. ఆ రెండు పార్టీల డ్రామాలు ఎండగట్టి పార్లమెంటు ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ను గెలిపించేందుకు కార్యకర్తలు ఇప్పట్నుంచే నడుం బిగించాలన్నారు.

Also Read:కాంగ్రెస్ ది అధికారమా.. అహంకారమా?

- Advertisement -