Harishrao:కాంగ్రెస్‌ది 420 మేనిఫెస్టో

47
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు మంత్రి హరీశ్‌ రావు. గజ్వేల్ లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన హరీశ్..కాంగ్రెస్ పార్టీది 42 పేజీల మేనిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో అని మండిపడ్డారు.

నాడు రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెప్పి…ఇప్పుడు జనం ఎక్కడ కొడతారో అని 24 గంటల కరెంట్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ హామీలు ఆచరణ సాధ్యం కానివన్నారు. ఇవే హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని విమర్శించారు. గజ్వేల్ అభివృద్ధి చెందినట్టు.. హుజురాబాద్ చేసారో చెప్పాలని ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు.

ఎలాగూ గెలిచేది లేదని ఆచరణ సాధ్యం కాని హామీలతో ముందుకొచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదని… ఓట్ల కోసం ఝూటా మాటలు మాట్లాడుతున్న వారిని ఓడించాలన్నారు. అన్నం పెట్టిన కేసీఆర్‌ను మోసం చేసింది ఈటల రాజేందర్ కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:వరల్డ్ కప్ గెలుపుపై స్టార్ల రియాక్షన్

- Advertisement -