Harish:ప్రజల కోసం ప్రజా ఉద్యమం చేస్తాం

22
- Advertisement -

ప్రజల కోసం ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే హరీశ్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు నష్టం జరిగిన ప్రతిసారి బీఆర్‌ఎస్‌ ప్రజల పక్షాన పోరాటం చేసిందని చెప్పారు.

ఒక్కడితో మొదలైన బీఆర్‌ఎస్‌ ప్రస్థానం ఉధృతమై ఉప్పెనగా మారి ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిందని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ భావజాల వ్యాప్తి చేసి ప్రజలను కేసీఆర్‌ చైతన్యపరిచారని తెలిపారు. తన పదవులను గడ్డిపోచలుగా వదిలేసి ప్రజల్లో చర్చపెట్టి తెలంగాణ వాదాన్ని గెలిపించారన్నారు. జలదృశ్యం నుంచి జన దృశ్యంగా మారిన పరిణామంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు, అణచివేతలు, అనుమానాలు ఎదురయ్యాయని గుర్తుచేసుకున్నారు.

- Advertisement -