సీఎం రేవంత్ రెడ్డికి చురలు అంటించారు మాజీ మంత్రి హరీష్ రావు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన హరీష్..ప్రతిపక్షంపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్, సీఎం రేవంత్ వ్యవహారం చూస్తుంటే వ్యంగ్యం ఎక్కువైంది…వ్యవహారం తక్కువైంది అన్నట్లు ఉందన్నారు.
చిన్న వయసులో సీఎం కావడం తన అదృష్టమని రేవంత్ అన్నారు… కాబట్టి వ్యంగ్యం తగ్గించుకోని మాట్లాడితే బాగుంటుందన్నారు. చక్కగా మాట్లాడితే తప్పకుండా సహకరిస్తాం అన్నారు. పీవీకి భారత రత్న ఇవ్వడం గొప్ప విషయం అన్నారు.
పీవీకి భారతరత్న ఇచ్చినందుకు ఈ సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. మన పీవీ గౌరవాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని… కాంగ్రెస్ ప్రభుత్వం పీవీని పట్టించుకోలేదు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ ఘాట్‌ను ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేశాం. పీవీ కుమార్తె సురభి వాణిదేవీకి ఎమ్మెల్సీ ఇచ్చాం అని గుర్తు చేశారు.
Also Read:‘భీమా’.. ఫస్ట్ సింగిల్