అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్..ఉత్తమ్

5
- Advertisement -

అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అనుకున్నం, కానీ ఆయన్ని మించి తాత అయ్యిండు ఉత్తం కుమార్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. దుబ్బాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం, బిజెపి ఎంపీలపై ధ్వజమెత్తారు. ఉత్తం అబద్దాలు చూస్తే గోబెల్స్ అనేవాడు ఉంటే ఉరి పెట్టుకునేవాడు… రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను స్టే తెచ్చి ఆపిందే బిఆర్ఎస్, కేసీఆర్ అన్నారు.

ఉత్తం కుమార్ రెడ్డి విజయవాడకు పోయి చంద్రబాబును కలిసి బజ్జీలు తిని వచ్చిండు….అప్పటి నుంచి ఏం మాట్లాడటం లేదు,కృష్ణా నది జలాల్లో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు వాడనంత తక్కువ నీళ్లు వాడింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఆంధ్రాకు దాసోహం చేసి, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ లో పంటలను ఎండబెట్టింది కాంగ్రెస్…తాత్కాలిక కేటాయింపుల ప్రకారం, 65 టీఎంసీలు తక్కువ వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అన్నారు.

ఆరున్నర లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోవడమే, పంటు ఎండబెట్టడమే… దీనికి సమాధానం చెప్పు, చెంపేలేసుకొని ముక్కు భూమికి రాయి ఉత్తమ్ అన్నారు. గోదావరి బనకచర్ల మీద ప్రిపేర్ కాలేదు అంటున్నడు ఉత్తమ్..నీటి పారుదల శాఖ మంత్రి నువ్వు, ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నవు,స్టడీ చేయలేదని మాట్లాడటం నిర్లక్ష్యం, కేబినెట్ లో బనకచర్ల గురించి మాట్లాడేందుకు సమయం లేదా?, ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటదా? చెప్పాలన్నారు.

ఐదు గంటలు కమిషన్లు, పర్సెంటీజీలు, హైకమాండ్ కు పంపే మూటల గురించి మాట్లాడారా?… 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఏపీ తరలిస్తుంటే గుడ్లు అప్పగించుకొని చూస్తారా?,సుప్రీం కోర్టుకు వెళ్లరా, కేంద్ర మంత్రిని కలవరా, నీతి అయోగ్ లో సీఎం ఎందుకు మాట్లాడలేదు,ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నం అన్నారు. అపెక్స్ కమిటి అనుమతి లేకుండా, అంతర్ రాష్ట్ర అనుమతి లేకుండా, గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు కడుతుంటే ఎందుకు మౌనం… చంద్రబాబును ఎదురించే దమ్ము సత్తా లేదా, ఎందుకు లాగులు తడుస్తున్నాయి..ఎందుకు సుప్రీం కోర్టుకు వెళ్లరు, ఎందుకు ప్రధానిని ప్రశ్నించరు చెప్పాలన్నారు.

Also Read:బ్యాచిలర్స్ ప్రేమకథలు..

బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు..పూర్తిగా ఏపీకి దాసోహం అయిపోయారు,బిఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది… రాష్ట్రం స్పందించకుంటే సుప్రీం కోర్టుకు బిఆర్ఎస్ వెళ్తుందని చెప్పినం…ప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నం అన్నారు. కేంద్రం అడిషనల్ ఎఫ్ఆర్బిఎం, 40 వేల కోట్లు కేంద్రం ఈ ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నది. లేఖలు రాసి చేతులు దులుపుకుంటన్నారు…అఖిల పక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్లాలి, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేద్దాం పదండి అన్నారు.

- Advertisement -