Harishrao: రేవంత్‌రెడ్డిది నోరా?,మోరా?

7
- Advertisement -

రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్‌ రావు..రెండు లక్షల రుణమాఫీకి రూ.40వేల కోట్లు అవుతాయని మేనిఫెస్టోలో పెట్టారని.. కేబినెట్‌ మీటింగ్‌ పెట్టి 31వేల కోట్లు అని చెప్పారని.. బడ్జెట్‌లో ఏమో రూ.26వేల కోట్లే కేటాయించారని అడిగిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. రూ.26వేల కోట్లు ఏవిధంగా సరిపోతాయి? ఎవరికి ఎగనామం పెడతారని ఆరోజే నిలదీశానని చెప్పారు.

రుణమాఫీకి ఎగనామం పెట్టి.. మాఫీ చేశానని ఫోజులు కొడుతున్నానని మండిపడ్డారు. పాక్షికంగా రుణమాఫీ చేసి.. పూర్తిగా మాఫీ చేశామని అంటే ఎవరు ఒప్పుకోలేరన్నారు. దొంగనే దొంగ అన్నట్లుగా సీఎం రేవంత్‌ రెడ్డి తీరు ఉందని… రుణమాఫీకి ఎగనామం పెట్టి,మాఫీ చేశానని ఫోజులు కొడుతున్నానని మండిపడ్డారు. పాక్షికంగానే రుణమాఫీ చేశా.. తప్పయ్యిందని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రైతు రుణమాఫీ, రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్‌ఎస్‌ పట్టుబట్టిందని చెప్పారు. కానీ శాసనసభను వాయిదా వేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ నుంచి పారిపోయిందని తెలిపారు. రాష్ట్రంలో 31వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందని.. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పి… ఇప్పుడు 14వేల కోట్లు కోత పెట్టారని విమర్శించారు. నీది నోరా? మోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.31వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పి.. 17వేల కోట్లు మాఫీ చేస్తే.. రుణమాఫీ సంపూర్ణంగా అయినట్టా? కానట్టా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సుమారు 25లక్షల మంది రైతులకు రుణమాఫీ విషయంలో ఎగనామం పెట్టారని…ఇది మోసం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్య!

- Advertisement -