Harishrao:రాష్ట్రంలో RR ట్యాక్స్‌..ఈడీ ఎక్కడా?

20
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి నిన్న సిద్దిపేట లో చేసిన వ్యాఖ్యలు అసంబద్ద మైనవన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన హరీష్.. రేవంత్ రెడ్డి కి దేవుడి శాపాలు పెట్టారు ఆయన ఎప్పుడూ నిజాలు మాట్లాడడన్నారు. రేవంత్ రెడ్డి సిద్దిపేట అభివృద్ధి నీ కండ్లు ఉండి చూడలేక పోతున్నాడు..సిద్దిపేట అభివృది లో ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు లు సాధించిందన్నారు.

సిద్దిపేట పేరు లేకుండా అవార్డు లు రాలేదు… సిద్దిపేట కు మేము ఎం చేయలేదో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట కి మెడికల్ కళాశాల, పోలీస్ కమిషనర్ కార్యాలయం, ఐటీ హబ్ , రైతు బజార్ ఎన్నో తెచ్చింది, అన్నింటికి మించి తెలంగాణ తెచ్చాం అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు అంటే సిద్దిపేట పుణ్యమే, తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు మోచేతి నీళ్లు త్రాగేదన్నారు.

నిన్నటి వరకు మెదక్ అభివృద్ధి జరిగింది అని మాట్లాడింది నిజమా నేడు సిద్దిపేట అభివృద్ధి జరగలేదు అనేది నిజమా.. రేవంత్ రెడ్డి ఆగస్టు 15సిద్దిపేట కి వస్తా అనే సవాల్ నీ స్వీకరిస్తున్న అన్నారు. నా సవాల్ నీ రేవంత్ రెడ్డి స్వీకరిస్తలేడు, విలువలతో కూడిన రాజకీయం నాకు అలవాటు అన్నారు. వంద రోజులులో ఆరు గ్యారంటీ లు రెండు లక్షల రుణమాఫి చేస్తే రాజీనామా ఆమోదించుకొని నీకు శాలువా కప్పుత.. వ్యక్తిగా నా కంటే కోట్లాది ప్రజలకు న్యాయం జరగడం నేను కోరుకునేదన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది… గత ప్రభుత్వాన్ని బాదునం చేయాలనీ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉంది..రేవంత్ పాలన 5నెలల్లోనే రివర్స్ గేర్ లో నడుస్తుందన్నారు. కాంగ్రెస్ 5నెలలోనే కరెంట్ కోతలు వచ్చాయి కళ్యాణ లక్ష్మి చెక్కులు అగాయి, కొత్తవి ఇస్తలేరు కానీ పాత పథకాలు ఆపుతున్నారన్నారు. ఆర్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోడీ అంటున్నారు అది నిజమైతే ఈడి ఎందుకు రావడం లేదు.. నేతి బీరకాయ లో నెయ్యి ఎంత ఉంటదో రేవంత్ రెడ్డి మాటల్లో అంతా నిజం ఉంటదన్నారు. సిద్దిపేట జిల్లా ను రద్దు చేసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:KTR:బీజేపీకి ఎందుకు ఓటేయాలి?

- Advertisement -