తెలంగాణ నీటి హక్కులకు మరణశాసనం!

3
- Advertisement -

చంద్రబాబుతో కలిసి ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసిండు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్.. విభజన హామీల ముసుగులో జూలై, 2024లో చంద్రబాబు నాయుడు ప్రజాభవన్‌కు వచ్చినప్పుడే, బనకచర్ల చీకటి ఒప్పందం జరిగింది అన్నారు.

ఆ తర్వాత సెప్టెంబర్, 2024లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా విజయవాడకు వెళ్ళి, బాబు పెట్టిన బజ్జీలు తిని, బనకచర్లకు పచ్చజెండా ఊపిండు అన్నారు. నాడు బాబు కోసం బ్యాగ్ మ్యాన్ అయిన రేవంత్…నేడు బొంకు మ్యాన్ గా మారిండు అని ఎద్దేవా చేశారు.

బనకచర్ల మీద ఇప్పటికైనా ఈ బొంకుడు మాటలు బంద్ పెట్టు..నిన్న ప్రజా భవన్ లో రేవంత్ రెడ్డి బనకచర్లపై ఇచ్చిన ప్రెజెంటేషన్ తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా? లేదా అమరావతి నుండి బాబు పంపిండా? చెప్పాలన్నారు. చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్రానికి రాసిన లేఖలు గానీ మాట్లాడిన మాటలు గాని ఎక్కడా ప్రస్తావించలేదు అన్నారు.

Also Read:మేడారం మహాజాతర..తేదీలివే

- Advertisement -