కేసీఆర్ లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాలి లేదంటే సమాధానాలు చెప్పాలి..అది చేయకుండా మరగుజ్జు మనస్తత్వంతో, సంకుచిత మనస్తత్వంతో చిట్ చాట్ పెట్టుకున్నడు.కేసీఆర్ గారిది హిమాలయాల ఎత్తు కలిగిన మనస్తత్వం, రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వం..కేసీఆర్ గారు స్టేట్స్ మెన్ గా మాట్లాడితే, రేవంత్ స్ట్రీట్ రౌడీగా మాట్లాడాడు. చీప్ గా మాట్లాడాడు.తెలంగాణకు నొక్కుబడనీయను అంటే ఎందుకు అంత ఆక్రోశం రేవంత్ రెడ్డి. ఫ్రస్టేషన్లో రేవంత్ ఏదో మాట్లాడారు.కేసీఆర్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి ద్రోహిగా నిలబెట్టారు అన్నారు.
ఉత్తం… ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు.రెండేళ్లు అయ్యింది పింఛన్లు ఎందుకు పెంచలేదు, 2500 మహాలక్ష్మి ఏమైందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు అడిగారు.నిధులు సేకరించడంలో బాగా అనుభవం ఉందన్నరు, ఇప్పుడు ఏమైంది. వాటాలకు, లూటీలకు, దోపీడీలకు మాత్రమే మీ అనుభవం సరిపోయిందా?,రైతులను ఎందుకు గోస పెడుతున్నరు, యాపులు, మ్యాపులు ఏమిటంటే సమాధానం లేదు.ఫార్మాసిటీ ప్రాముఖ్యతను కేసీఆర్ గారు చెప్పారు. సమాధానం చెప్పారు. ఆర్థిక అరాచకత్వం బిఆర్ఎస్ పాలనలో అన్నరు. టోనీ బ్లెయిర్ గారు, సుబ్బారావు గారు తెలంగాణ ప్రగతి గురించి మొన్నటి సమ్మిట్ లో ఏం చెప్పారు.కొత్త రాష్ట్రం తెలంగాణ అద్బుతమైన అభివృద్ది సాధించింది అన్నరు.అయినా సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు.కేసీఆర్ గారు చేసిన అభివృద్ది గురించి నువ్వు ఆహ్వానించిన ప్రతినిధులే చెప్పారు.
రాజకీయాల కోసం ఎందుకు రాష్ట్రం పరువు తీస్తున్నవు రేవంత్ రెడ్డి,రాష్ట్ర ప్రగతి ఎందుకు దెబ్బ తీస్తున్నవు.పచ్చ కళ్లద్దాలు పెట్టుకుంటే పచ్చగా కనిపించినట్లు రేవంత్ తీరు ఉంది.సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటూ పెరిగిన అని చెప్పిండు రేవంత్ రెడ్డి..50కోట్లు పెట్టి పీసీసీ కొన్నడు అని కోమటి రెడ్డి చెప్పిండు.
ఎమ్మెల్యేను కొనుగోలు చేసే క్రమంలో 50లక్షలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగవు నువ్వు.నువ్వు నిజాయితీ గురించి మాట్లాడటం సిగ్గు.
పార్టీ తల్లి, పార్టీ అధ్యక్షుడు తండ్రి లాంటి వారు మాకు పుట్టుక ఒక దాంట్లో, సదువు ఒక దాంట్లో, ఉద్యోగం ఒక దాంట్లో రేపు ఎందులో ఉంటవో
చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీ మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి ,త్యాగాల చరిత్ర మాది, వెన్నుపోటు చరిత్ర మీది నీకు మాట్లాడే నైతికత ఉందా రేవంత్ రెడ్డి ఊసరవెల్లి కూడా నిన్ను చూస్తే సిగ్గుపడుతుంది.సోనియాను దేవత అంటవు, బలి దేవత అంటవు ,నీకో స్టాండ్, సిద్దాంతం ఉందా రేవంత్ రెడ్డి 2022-23లో 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నెంబర్ 1గా చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం ,ధాన్యం సేకరణలో 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డు నెలకొల్పినం,మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్, అనంతగిరి కింద పండ పంటల కాళేశ్వరం కాదా?,వర్షాలు బాగా ఉంటే ఎస్సారెస్పీ నుంచి, మధ్య పరిస్థితులు ఉంటే ఎల్లంపల్లి..నుంచి, కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీళ్లు వాడుతం నువ్వు రాకముందే ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ ఏంది.
రెండేళ్లు అయినా ఉత్తం ప్రెస్ మీట్లకు ప్రిపేర్ కాకుండా రావడం సిగ్గుచేటు.సగం సగం చదవి సగం సగం చెబుతడు. 2023లో డీపీఆర్ వాపస్ వస్తే కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (CEA) అనుమతి, సెంట్రల్ సాయిల్ & మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్(CSMRS) అనుమతి, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ (MoTA) అనుమతి, కేంద్ర భూగర్భ జల బోర్డు (CGWB) అనుమతి ఎట్ల సాధించినం.పాలమూరు డీపీఆర్ 12.04.2023 లో వాపస్ వస్తే, మూడు రోజుల్లోనే మా ప్రభుత్వం జల్ శక్తి మినిస్ట్రీ కి లేఖ రాసింది. కేసీఆర్ గారు జల్ శక్తి అధికారులతో మాట్లాడారు.అక్కడ నుంచి cwc కి అప్రైసల్ కొనసాగించమని ఆదేశాలు ఇప్పించినం.EAC సిఫారసు సహా 7 అనుమతులు సాధించినం. ఇది వాస్తవం కాదా? 19.12.2024 లో DPR వాపస్ లేఖ రాస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు.ఇదే కదా కేసీఆర్ గారు నిన్న మిమ్మల్ని నిలదీసింది..రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదు.ఇది కాకుండా 45 టీఎంసీలు చాలు అంటూ ఢిల్లీకి రాసిండు ఉత్తం కుమార్, సీఎం.సిగ్గులేకుండా మేం రాయలేదు అంటున్నారు.డీపీఆర్ వాపస్ తెస్తవు, 45 టీఎంసీలు చాలు అంటవు.45 టీఎంసీలతో ఎవరికి అన్యాయం చేస్తవు, పాలమూరుకా, రంగారెడ్డికా, నల్లగొండగా
ఎవరి డైరెక్షన్.. చంద్రబాబు డైరెక్షనా?,దానికి సమాధానం చెప్పకుండా చిల్లర వాగుడు ఎందుకు.45టీఎంసీలు చాలు అని నువ్వు లెటర్ రాసావు. సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు చెప్పాలన్నారు.
పాలమూరు 90శాతం పనులు ఎక్కడ అయ్యాయి అంటున్నరు వస్తరా? పోదామా?,90శాతం పనులు పూర్తి చేసింది వాస్తవం. మీరు రెండేళ్లలో ఏం చేసారు?
16 సెప్టెంబర్ న నార్లాపూర్ పంప్ హౌజ్ లో పంపు ను రన్ చేసి మహబూబ్ నగర్ ప్రజానీకానికి ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తాయన్న భరోసాను కల్పించిండు కేసీఆర్
నార్లపూర్ -95 % పూర్తి, డిసెంబర్ 2023 జలాశయంలో 2 టిఎంసిల నీటిని నింపడం జరిగినది. ప్రస్తుతం జలాశయంలో 4 టిఎంసిల నీటి నిల్వ ఉన్నది. ఈ ఘనత మా ప్రభుత్వానికి కాదా ? ,ఏదుల, వట్టేం, కరివెన, ఉద్దండాపూర్ పనులు దాదాపు పూర్తి చేసినం. కేవలం రెండు కిలోమీటర్లు తవ్వుతే నీళ్లు నిండుతయి.బిఆర్ఎస్ ఉండి ఉంటే కోడంగల్, నారాయణ్ పేట్ రైతుల కాళ్లు కృష్ణా నీళ్లతో కడిగే వాళ్లం.పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటూ పాలమూరు గొంతు కోయడమేనా రాజకీయం ? 299:512 విషయంలో మూతి పలగ్గొట్టే విధంగా ముత్తూడ్ సమాధానం అసెంబ్లీలోనే చెప్పిన.ఈ ఒప్పందానికి మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ.కృష్ణాలో 299:512 వాటా ఇచ్చి, తెలంగాణ తీరని చారిత్రక ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. 18.10.2013 నాడు ఉమ్మడి ఏపీ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి రిపోర్టు ఇచ్చింది. ఇదే రిపోర్టును శాసనసభలోనూ పెట్టారు. జులై 14, 2014 నాడు కృష్ణాలో 299 అన్యాయం అని కేంద్రానికి లేఖ రాసిండు కేసీఆర్. ఢిల్లీకి పోయి పోరాటం చేసిండు కేసీఆర్ రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే.. ఆనాటి కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది, కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కేంద్రాన్ని కోరినం.
తెలంగాణ పట్ల మా చిత్తశుద్దికి, నిజాయితీకి నిదర్శనం ఇది.మేం 299 శాశ్వత ఒప్పందం చేసుకుంటే, సెక్షన్ 3 ఎందుకు అడిగాం, అపెక్స్ కౌన్సిల్ ఎందుకు పోయాం, ఎందుకు సుప్రీంకు మెట్లు ఎక్కారు కేసీఆర్ గారు.సెక్షన్ 3 సాధించింది కేసీఆర్. కేసీఆర్ సంతకం పెట్టిండు అంటవు, యాడ పెట్టిండు చూపెట్టు రేవంత్ రెడ్డి.17.2.2025 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ లో ఏముంది. అదే తాత్కాలిక ఒప్పందం వీళ్లు కూడా చేసుకున్నరు. దీని గురించి ఏమంటరు?,దీనిపై రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు అని మేం అనలేమా? కానీ మేం చిల్లరగా మాట్లాడం.అందులో ఏముంది ఫైనల్ అవార్డు వచ్చే దాక 50:50 చేసుకుందామని మీ సెక్రెటరీ రాసిండు.అదే డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ 28 లెటర్లు రాసి అడిగింది.మీరు కొత్తగా చేసింది ఏముంది, కొత్తగా రాసింది ఏముంది.పదేండ్లలో కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు అని పచ్చి అబద్దం ఆడుతున్నారు.అది నోరా మోరా ఉత్తం.2014 నుంచి 2023 వరకు 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 31.50 లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినం.తొమ్మిదిన్నరేళ్లలో మొత్తం 48.74లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా? ,అసెంబ్లీలో ఇచ్చినం అంటవు, నిన్ననేమో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు అంటవు.అంటే 2024-25 బడ్జెట్ లో ఆ ఏడాదికి 6,55,895 ఎకరాల ఐపీ క్రియేట్ చేస్తం అన్నరు. 2025-26 బడ్జెట్ లో 5,05,000 ఎకరాల ఐపీ క్రియేట్ చేస్తం అన్నరు.అంటే మొదటి రెండేళ్లలో 11,60,895 ఎకరాలు. 11 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినవా ఇస్తే ఎక్కడ ఇచ్చినవో చెప్పాలని సవాల్ విసురుతున్నా.,చెప్పకపోతే అసెంబ్లీ సాక్షిగా తప్పు చెప్పా అని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు తెలంగాణ సమాజానికి రెండేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక్క చెక్ డ్యాం పూర్తి చేసింది లేదు.మీరు చేసింది చెక్ డ్యాంల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప చేసింది ఏముంది?,ప్రాజెక్టులు, చెక్ డ్యాంలను కూల్చి వేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి ఎస్ ఎల్ బీ సీ కుప్పం కూలితే శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది రేవంత్ రెడ్డి.కృష్ణా నీళ్లలో అతి తక్కువ నీటి వినియోగం జరిగింది రేవంత్ రెడ్డి పాలనలో నల్లమల బిడ్డకు బేసిన్లు తెల్వదా?,కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా పెడుతురన్నది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18.06.2025 నాడు ఏమన్నడు కృష్ణా బేసిన్ మీద 500 టిఎంసీలకు బ్లాంకెట్ ఎన్ ఓ సీ ఇవ్వండి, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైన కట్టుకోండి అన్నడు.సెప్టెంబర్ 13న జరిగిన నీటి పారుదల శాఖ సమీక్షలో ఇదే ముఖ్యమంత్రి ఏమంటడు.. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలె అంటడు. ఉత్తం ఏమో 763 టిఎంసీల రైట్ షేర్ అంటడు, ముఖ్యమంత్రి ఏమో ఓ సారి 500 టీఎంసీ అంటడు. ఓసారి 904 టీఎంసీలు అంటడు.
పూటకో మాట మాట్లాడి పరువు తీసుకుంటున్నరు.వీళ్ల అజ్నానం వల్ల తెలంగాణ రాష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉంది.
కావాలనే తెలంగాణకు ద్రోహం చేస్తున్న అసలైన జల ద్రోహి రేవంత్ రెడ్డి. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం రోజు 10వేల క్యూసెక్కుల నీళ్లు తరలించుకుపోతుంటే, తెలంగాణ ప్రభుత్వం చేవచచ్చి, చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తున్నారు. ఇప్పుడు కూడా పోతున్నాయి.కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టిఎంసీలు, కానీ 650 పైగా నీళ్లు ఏపీ తరలించుకుపోతుంటే మీ నోరు పెగలదా? మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ,తెలంగాణ నీటి ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్, తెలంగాణ ప్రజల పాలిట పెను శాపం.కల్వకుర్తి,బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదు. 1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ మేము పదేండ్లలోనే 2600 కోట్లు ఖర్చు చేసి 3 లక్షల 7వేల ఎకరాలకు నీళ్లు అందించాం.నెట్టంపాడు 2300 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము 540 కోట్లు ఖర్చు పెట్టి లక్షా 40వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.బీమా కింద 12వేల ఎకరాలకు మీరు నీళ్లు ఇస్తే 646 కోట్లు ఖర్చు చేసి లక్షా 60వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.కోయిల్ సాగర్ కింద 38వేల ఎకరాలకు ఇచ్చినం.ఈ నాలుగు ప్రాజెక్టుల కింద ఆరున్నర లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాం.మొత్తంగా పాలమూరులో పది లక్షల ఎకరాల్లో నీళ్లు పారించినం అన్నారు.

