Harishrao:రైతుల ఆత్మహత్యలపై స్పందనేది?

19
- Advertisement -

రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం బాధాకరమరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని ఎక్స్ వేదికగా విమర్శించారు.

ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారు..రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -