కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం కాదు బుల్డోజర్!

8
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి, బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలని సూచించారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన హరీశ్ రావు…పేదల ఇళ్లను కూల్చడాన్ని తప్పుబట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్టం తెచ్చిందని..ఆ చట్టం ప్రకారం ఇల్లు కులిస్తే ఆ ఇంటి విలువకు మూడింతలు ఎక్కువ నష్ట పరిహారం కట్టించాలన్నారు.

ఆ ఇంట్లో 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వారి జీవనోపాధి కోసం 5 లక్షలు ఇవ్వాలని.. వాళ్లకి అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు.ఇక్కడ కొందరు చోట మోట లీడర్లు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నామని గోప్పలు చెప్పుకుంటున్నారు…కానీ ల్యాండ్ అక్విజిషన్ ఆక్ట్ ప్రకారం బాధితులకు అన్ని కల్పించాకే వాళ్ల ఇంట్ల దగ్గరికి వెళ్లాలన్నారు.

పాపం 9 నెలల నిండు గర్భిణి నెల రోజుల నుండి నిద్ర పోతలేను అన్న కంటి మీద కునుకు లేదని బాధ పడుతుంది…నిన్న తెలంగాణ భవన్లో అక్క, చెల్లలు మాట్లాడుతుంటే నా కళ్ళలో నీళ్లు ఆగలేదు అన్నారు మరీశ్‌. ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండేనా? మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరుగుతుంది, కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరగడం లేదు అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది ,4000 పెన్షన్ ఇవ్వమని అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాడు అన్నారు. రైతులకు రైతు భరోసా 7500 వెయ్యమంటే దానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు, మహిళలకు 2,500 ఇవ్వమని అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు అన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఎ అందజేయండి అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాడు…ఏది అడిగినా డబ్బులు లేవు అంటున్న రేవంత్ రెడ్డి.. మరి మూసీ సుందరీకరణకు లక్ష 50 వేల కోట్లు ఎక్కడ నుంచి వస్తాయి? అని ప్రశ్నించారు.

Also Read:Harishrao:బుచ్చమ్మది ఆత్మహత్య కాదు..ప్రభుత్వ హత్యే

- Advertisement -