Harish:కాంగ్రెస్ వచ్చాకే తాగునీటి కటకట

12
- Advertisement -

కాంగ్రెస్ వచ్చాక బోర్లలో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు, తాగడానికి నీళ్లులేవు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారంలో భాగంగా బెజ్జంకిలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న హరీష్…పంటలు ఎండిపోతున్నాయి. కరెంటు ఉండడం లేదు అన్నారు. వద్దురో కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్నారన్నారు.

రైతులను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని…కేసీఆర్ హయాంలో వడ్లను గిట్టుబాటు ధరకు కొన్నాం. 500 బోనస్‌తో 2500కు కొంటామన్న రేవంత్… ఇప్పుడు రైతులు 1800లకే అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నడు?కేసీఆర్ కరోనా సమయంలో సైతం రైతుబంధు ఆపలేదు అన్నారు.రేవంత్ రైతులకిచ్చిన రైతుబంధు 15వేలు, కౌలురైతులకు 15వేలు, వ్యవసాయ కూలీలకు 12వేలు ఇస్తామని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. పైగా 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిండు..అవ్వాతాతలకు 4 వేల పింఛన్ ఇస్తామని వాళ్లనూ మోసం చేసింది కాంగ్రెస్ అన్నారు.మహిళలకు నెలకు 2500 ఇస్తామని రేవంత్ చెప్పిండు..వాళ్లకు 10 వేలు బాకీపడిండు అన్నారు.

ఓట్ల కోసం కాంగ్రెస్ లీడర్లు వస్తే బుద్ధి చెప్పడానికి మహిళలు, చీపుర్లు, చాటలతో రెడీగా ఉన్నారు.ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నాడు. రెండు నెలల్లో లక్ష లగ్గాలు జరిగాయి. రేవంత్ లక్ష తులాల బంగారం బాకీ పడ్డడు. మన గుండెలమీద తన్నిన రేవంత్ రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో గడ్డపారలై పోటుపొడవాలె.నాలుగు నెలలైనా హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేసి మోసపోదామా?బీజేపీ పదేళ్ల పాలన ప్రజలకు ఒక్క మేలైనా చేసిందా? చెప్పుకోడానికి ఏమీ లేదు కనుక కేలండర్లు, అక్షింతలు పంచుతున్నారు అన్నారు.

Also Read:KCR:22 నుంచి రోడ్డు షో లు..

- Advertisement -