రేవంత్ మొనగాడు కాదు మోసగాడు: హరీశ్‌ రావు

5
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి.. మొనగాడు కాదు మోసగాడు అని తేలిపోయిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతు ధర్నా కర్యక్రమంలో మాట్లాడిన హరీశ్‌ రావు.. పది నెలల పాలనలో రేవంత్ రెడ్డి కి రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదు… మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నడు. డిసెంబర్ 9 అన్నడు. ఆగష్టు 15 అన్నాడు..కొమిరెల్లి మల్లన్న, యాదాద్రి , భద్రాద్రి, సమ్మక్క సారలమ్మ మీద ఒట్టు పెట్టీ మొనగాడు లెక్క మాట్లాడిండు అన్నారు.

రైతు బంధు, రుణమాఫీ, పింఛన్లు, మహాలక్ష్మి అన్ని చేస్తా అన్నాడు. ఇప్పుడు సపుడు లేదు… మొత్తం రుణమాఫీ అయ్యింది రాజీనామా చెయ్యి హరీష్ రావు అని సవాల్ విసిరిండు అన్నారు. రుణమాఫి అయితే ఎందుకు ఇంత మంది వచ్చారు…పాలకుర్తి మండలం లోనే 4314 మందికి రుణమాఫీ కాలేదు అన్నారు హరీశ్‌. తుమ్మల చెప్పారు 22 లక్షల మందికి చేశా. మిగతా వారికి కాలేదు అన్నడు… చెప్పిన 22 లక్షల మందిలో కూడా రుణమాఫీ కాలేదు అన్నారు హరీశ్‌.

భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 15 వేలు అన్నడు. కాలేదు, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు అన్నడు కాలేదు అన్నారు. రైతు కూలీలు, భూమి లేని రైతులకు పంట బీమా పథకం అన్నడు. కాలేదు, పోడు, అసైండ్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తా అన్నడు. కాలేదు అన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదు.. రాష్ట్రంలో రౌడీయిజం నడుస్తుందని.. హైద్రాబాద్ లో హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారు అని మండిపడ్డారు హరీశ్‌.

Also Read:సీఎం రేవంత్‌కి కేవీపీ లేఖ

- Advertisement -