అక్రమ అరెస్ట్‌లకు భయపడేదిలేదు: హరీశ్‌

11
- Advertisement -

కేటీఆర్‌పై ప్రభుత్వం పెట్టింది అక్రమ కేసులు అని మండిపడ్డారు మాజీమంత్రి హరీశ్‌ రావు. కేటీఆర్ నివాసంలో మీడియాతో మాట్లాడిన హరీశ్‌…తప్పు జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నార. ఇది ముమ్మాటికీ తప్పుడు కేసు అన్నారు. విచారణ సమమంలో అడ్వకేట్లు వెళ్తే తప్పేంటన్నారు.

ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారన్నారు. కేసులు పెట్టినా..అరెస్ట్ లు చేసినా న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు. 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్తారన్నారు.గ్రీన్‌ కోకు ఒక్క రూపాయి ప్రభుత్వం తరపున ఇవ్వలేదన్నారు.అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు హరీశ్‌ రావు. కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు.

ఫార్ములా ఈ కేసులో అవినీతే లేదన్నారు.బీఆర్ఎస్ నేతలకు అరెస్ట్‌లు కొత్తకాదన్నారు. రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన దొంగ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసులు పెడుతున్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టిన పోరాటం ఆగదన్నారు హరీశ్‌ రావు.

Also Read:సీఎం పేరు తెల్వనోడు యాంకరా?: కాంగ్రెస్ ఎంపీ

- Advertisement -