Harishrao:బుచ్చమ్మది ఆత్మహత్య కాదు..ప్రభుత్వ హత్యే

9
- Advertisement -

హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక, తన ఇల్లు ఎప్పుడు కూలగోడతారోనని ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంది కూకట్ పల్లికి చెందిన బుచ్చమ్మ. ఇది ఆత్మహత్య కాదు.. రేవంత్ ప్రభుత్వం చేసిన హత్య అని మండిపడ్డారు హరీశ్‌ రావు. ఇంకా ఎంత మందిని చంపదలుచుకున్నావ్ రేవంత్ అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలకు ఏ కష్టమొచ్చినా గుర్తొచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆరే అన్నారు. ఒక్క ఫోన్ చేస్తే చాలు.. మేమంతా వచ్చేస్తాం.. మీకు అండగా నిలబడతాం అన్నారు. మూసీ సుందరీకరణ హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ భరోసా హైడ్రా వేదింపులతో ఆత్మహత్య చేసుకున్న కూకట్ పల్లికి చెందిన బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆస్పత్రికి వెళ్లారు మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి.

రేవంత్ రెడ్డి ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటావ్, ఇంకెంతమందిని చంపుతావ్?? అని మండిపడ్డారు హరీశ్‌ రావు. హైడ్రా అధికారుల వేధింపులతో ఇల్లు ఎక్కడ కులగోడతారోనని ఆందోళనతో కూకట్ పల్లికి చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నారు అని మండిపడ్డారు.

Also Read:Gold Price: బంగారం ధరలివే

- Advertisement -