Harishrao: యూ ట్యూబ్ అంటే వణికిపోతున్న రేవంత్

4
- Advertisement -

యూట్యూబ్ లు చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి వెన్నుల్లో వణుకు పుడుతోందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. నర్సాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన హరీశ్‌..రేవంత్ ఫార్మసీటీ, మెట్రో రైలు విషయంలో రూటు మార్చావు అన్నారు. నర్సాపూర్ లో ఏ గ్రామానికి పోయిన రుణమాఫీ కాలేదని చెబుతున్నారు… రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ నాయకులను రైతులు రూముల్లో వేసి బంధిస్తున్నారు అని దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని…రాష్ట్రంలో 50 శాతానికి మించి రుణమాఫీ కాలేదు అన్నారు.
41 లక్షల మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంటే.. 20లక్షల మందికి మాత్రమే చేశారు.. ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ కాలేదు అని తెలిపారు. రైతుబంధు ఎగ్గొట్టేశావు, రైతుబంధు నిధులు విడుదల చేయాలన్నారు.

బీఆర్ ఎస్ ప్రభుత్వం, రెండుసార్లు రుణమాఫీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అంటివి, ఇప్పుడేమో సన్నవడ్లకు బోనస్ ఆంటీవి, బోనస్ ని బోగస్ చేశావు అని దుయ్యబట్టారు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామపంచాయతీకి నిధులు విడుదల అవ్వట్లేదు, సర్పంచులను కదిలిస్తే కన్నీళ్లు బయటకు వస్తున్నాయి… గత ప్రభుత్వంలో ప్రతినెల పల్లె ప్రగతికి నిధులు వచ్చాయి, ఇప్పుడు నిధులు కరువయ్యాయన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టణాలను గ్రామాలను గాలికి వదిలేసింది, హైడ్రా పేరిట డ్రామాలు చేస్తున్నాడన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీపై ఇచ్చిన 800 కోట్ల రూపాయలు దారి మళ్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రైతులకు 100 శాతం రుణమాఫీ అయ్యేదాకా, పంట బీమా, భరోసా కల్పించకపోతే రానున్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.

Also Read:111 ఎకరాలు స్వాధీనం చేసుకున్న హైడ్రా!

- Advertisement -