కాంగ్రెస్ నాయకులకు చట్టం..చుట్టమా రేవంత్ రెడ్డి?

3
- Advertisement -

సినీనటుడు అల్లు అర్జున్ విషయంలో చూపుతున్న చొరవను, అన్ని వర్గాల మీద చూపాలనే బీఆర్ఎస్ కోరుతుందన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ఒక వ్యక్తిని టార్గెటెడ్ గా చేసి కేసులు పెడుతున్నట్లుగా కనబడుతుందని…ఆ అమ్మాయి చనిపోవడం దురదృష్టకరం అన్నారు. మరి అలాగే నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, 50 మందికి పైగా గురుకుల పిల్లలు చనిపోతే, ఆ పిల్లల ప్రాణాలకు విలువ లేదా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి?, ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎందుకు ఒక్క రూపాయి ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు? అని ప్రశ్నించారు.

ఎస్సీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ మంత్రిగా మీరే ఉన్నారు కదా….అదే విధంగా నీ తమ్ముడి అరాచకాల వల్ల చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి, సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ కాలేదు? చెప్పాలన్నారు. ఇంతవరకు నీ తమ్ముడిని ఎందుకు అరెస్టు చేయలేదు?, చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా.. చట్టం నీకు చుట్టమైందా? చెప్పాలన్నారు.

80 మందికి పైగా ఆటో డ్రైవర్లు చనిపోతే నీలో చలనం లేదు..450 మందికి పైగా రైతులు చనిపోతే నీలో చలనం లేదు, కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, ఉద్దేశపూర్వకంగా చేయడం వల్ల రాష్ట్రం ఇమేజ్ దెబ్బతిని, నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడిచేసిన కాంగ్రెస్ గుండాలు అందరూ ఆయనతో ఫోటోలు దిగినోళ్లే…ఇవాళ వాళ్లనే తీసుకొనిపోయి అల్లు అర్జున్ ఇంటిమీద దాడి చేశారు అన్నారు.

సిద్ధిపేటలో కూడా గూండాలతోని నా క్యాంపు ఆఫీసు మీద దాడి చేయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుల మీద దాడి చేస్తుందన్నారు. భౌతిక దాడుల ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేయాలని, ప్రశ్నించకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నరు….గతంలో ఇలాంటి సంస్కృతి తెలంగాణలో ఎప్పుడూ లేదు..రాయలసీమ తరహా ఫ్యాక్షనిస్టు సంస్కృతిని, దాడులు చేసే సంస్కృతిని ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణలో తెచ్చి, లా అండ్ ఆర్డర్ ను కుప్ప కూలుస్తున్నడన్నారు.

Also Read:అల్సర్ ఉందా..అయితే మీ కోసమే!

- Advertisement -