రైతులను దగా చేస్తున్న ప్రభుత్వం: హరీష్ రావు

1
- Advertisement -

భోగ భాగ్యాలను అందించే భోగి పండుగ, కొత్త కాంతులను తెచ్చే సంక్రాంతి పండుగ, కనుమ పండుగలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన హరీశ్…రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ అడుగడుగునా రైతులను దగా చేస్తుందన్నారు.

మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ప్రభుత్వ చేతలు మాత్రం గడప దాటడం లేదు…మహబూబ్ నగర్ జిల్లాలో రైతు విజయోత్సవాలలో 2750 కోట్లు రుణమాఫీ కోసం ముఖ్యమంత్రి విడుదల చేశారు అన్నారు. రెండు నెలల కిందట రైతు రుణమాఫీ కోసం ఇచ్చిన చెక్కు ఇప్పటివరకు ఇంకా సంగారెడ్డి రైతులకు చేరలేదు…ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే దిక్కు లేకపోతే ఎలా? అన్నారు. నవంబర్ 30న ముఖ్యమంత్రి చెక్కిస్తే ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ కాలేదు….ఎన్నికల్లో డమ్మీ హామీలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి అయినంక కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? అని ప్రశ్నించారు.

రైతులను ప్రజలను మోసం చేయడమే మీ లక్ష్యం…మీరు ఇచ్చిన చెక్కుకు ఈరోజు వరకు ఎందుకు రైతుల ఎకౌంట్లో డబ్బులు పడలేదు?, అందరికీ రుణమాఫీ అని కొందరికి మాత్రమే చేశారు…. రెండు లక్షల పైన రుణమున్న రైతులు ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం ఆ పైన ఉన్న అప్పును కట్టారు.ఇంకా వారికి రుణమాఫీ కాలేదు,పంటల బీమా విషయంలో కూడా రైతులను దగా చేశారు అన్నారు.

కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు…ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఉపాధి హామీ కూలీలను కూడా దగా చేస్తున్నారు. ..అడుగడుగునా రైతులను మోసం చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వమని వారు చెప్పకనే చెప్తున్నారు అన్నారు.ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం….ఎన్నికల్లో రైతులకు అరిచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల తర్వాత మొండి చేయి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read:భోగ భాగ్యాలనిచ్చే ‘భోగి’

- Advertisement -