పార్టీ ఫిరాయించిన వ్యక్తికి చీఫ్ విప్ పదవా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందన్నారు హరీశ్ రావు. అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా .. పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.
పట్నం మహేందర్ రెడ్డి అనర్హత పిటిషన్ కౌన్సిల్ ఛ్మైరన్ దగ్గర పెండింగ్ లో ఉందని…రేవంత్ హాయాంలో రాజ్యంగం ఎలా ఖూనీ జరుగుతుందనే దానికి ఇదొక ఉదాహరణ అన్నారు. పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందన్నారు. అరికెపూడి గాంధీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారు …పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ప్రభుత్వం చెప్పాలన్నారు.
బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చీప్ విప్ బాధ్యత…మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడు?.. అధికార పార్టీ సభ్యులకా… ప్రతి పక్ష పార్టీ సభ్యులకా అని ప్రశ్నించారు. ఆయన విప్ జారీ చేస్తడా.. లేక బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన విప్ ను పాటిస్తాడా…విప్ అనే వ్యక్తి తన పార్టీ ఆదేశాలనుసారం నడుచుకోమని జారీ చేసేది విప్..ఎదుటి పార్టీ వారిని చీప్ విప్ చేస్తే ఏ పార్టీకి విప్ జారీ చేస్తాడు అన్నారు.
Also Read:KTR: సురేఖపై కేటీఆర్ పిటిషన్ విచారణ