రైతు భరోసాకు కోతలా: హరీశ్‌

0
- Advertisement -

తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. రేవంత్ రెడ్డి విజయవంతంగా రైతుబంధును ఎగ్గొట్టి, రైతు భరోసా కు కోతలు పెట్టేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు…వ్యవసాయ మంత్రి,ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు కుస్తీ పడుతున్నారు అన్నారు.

ఇదే రేవంత్ రెడ్డి గతంలో రైతుబంధు ఏడాదికి మూడుసార్లు ఎందుకు ఇవ్వరు అని అడిగారు. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా రైతుబంధు ఇవ్వలేదు.
ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అధికారంలో ఉంటే ఒక మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలుకకు నరం లేదు ఏదైనా మాట్లాడుతాడు.అధికారంలోకొస్తే ఏదైనా మర్చిపోతారు అన్నారు.

రుణమాఫీకి షరతులు పెట్టి సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు..ప్రభుత్వం వద్ద అన్ని రికార్డులు ఉన్నాయి. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులతోనే కెసిఆర్ గారు 11 సార్లు రైతుబంధు రైతులకు ఇచ్చారు. రైతు భరోసా కు రైతులు దరఖాస్తు చేసుకోవాలంట.. నేనిస్తున్న సమాచారం అంతా కరెక్టు. తప్పుడు సమాచారం ఇచ్చినా తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుడిని అని రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు.

ఇది రైతులను అవమానపరచడం కాదా?,దేశానికి అన్నం పెట్టే రైతు ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతావా?,
బడా బాబులకు, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి షరతులు లేకుండా వేలకోట్లు మాఫీ చేస్తారు. రైతులంటే షరతులు వస్తున్నాయి మీకు అన్నారు. రైతులకు బేడీలు వేసి అవమానించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రైతు భరోసా విషయంలో కూడా రైతులను నేరస్తులుగా భావించడం దారుణం..అన్నదాతలంటే అంత అలుసు ఎందుకు రేవంత్ రెడ్డి నీకు..రుణమాఫీ కోసం రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పారు.. ఇప్పుడు రైతు భరోసా కోసం కూడా మళ్లీ పైరవీ కారుల చుట్టూ కాంగ్రెస్ నాయకులు చుట్టూ తిరగాలని మీరు చూస్తున్నారు అన్నారు.

- Advertisement -