Harishrao: మూసీకి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు

3
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుత విన్యాసం చూస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మీడియాతో మాట్లాడిన హరీశ్‌ రావు..మూసీ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేరవేర్చలేక నీతిమాలిన పద్ధతిలో మాట్లాడుతున్నారన్నారు హరీశ్‌.

ముఖ్యమంత్రి మాటలు చూసి చిన్న పిల్లలు నవ్వుకుంటున్నారు…హైదరాబాద్ చుట్టూ సముద్రాలూ ఉన్నాయి అంటాడు, మూసి మాత్రమే నగరాలు ప్రవహించే నది ఒక్కటే అని మాట్లాడతారు , సీఎం కుర్చీ గౌరవన్నీ తగ్గిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. అబ్బద్దమే ఆశ్చర్య పడే విధంగా మాట్లాడాడు సీఎం రేవంత్ రెడ్డి…సుందరికరణ పదమే లేదు అని సీఎం చెపుతున్నాడు…మరీ సీఎం ప్రెసెంటేషన్ రివర్ రేజువేనేషన్, రివర్ ఫ్టంట్ అని ఉంది కదా అన్నారు.

మూసి శుద్ధికరణ అంటే నీటిని శుద్ధి చేయాలి …కేసీఆర్ హయాంలోనే ఆ పని పూర్తి అయింది ఎస్ టి పిల ను నిర్మించారు అన్నారు. మూసి పునర్జవం కోసం బి ఆర్ ఎస్ పనులు ప్రారంభించిందని…అసలు పని వదిలిపెట్టి అటు 50 మీరుర్లు, ఇటు 50 మీటర్లు కులగోడతా,పేదలు ఇండ్లు కులాగోడాతా అంటున్నావు అన్నారు. ఇల్లు కూలగొట్టి మాల్ కట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్ రూమ్ ఇచ్చి నేను డబల్ బెడ్ రూమ్ ఇచ్చిన అని చెప్పుకుంటున్నావు..నీ  మొఖానికి ఒక్క ఇల్లు కట్టినవా రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:KTR: మూసీ బాధితులకు అండగా ఉంటాం

- Advertisement -