తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్: హరీశ్‌ రావు

1
- Advertisement -

తుర్కయాంజల్, జేబీ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు.తెలంగాణ అమరవీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఏటా నిర్విహిస్తున్న ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ నాయకుడు నర్సింగరావుకి అభినందనలు తెలిపారు.

తెలంగాణ అమర వీరుల గురించి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆలోచిస్తుందని…అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, పది లక్షలు ఇచ్చి అమరులను గౌరవించింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అన్నారు. అమరుల త్యాగం, విద్యార్థులు, కేసీఆర్ కృషి ఫలితం కేసీఆర్, తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1 గా చేసిండు కేసీఆర్ అన్నారు. ఐటీ, ఆర్థికం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో కేసీఆర్ నెంబర్ 1 గా నిలిపారు…పదేళ్లలో అగ్రస్థానం, రేవంత్ 11 నెలల పాలనలో అధ:పాతాళానికి తీసుకెళ్లాడు అన్నారు.

హైదరాబాద్ చుట్టూ ముడు దిక్కుల సముద్రం అంటడు, దిల్ సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతడు అంటడు…రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట. ఇట్ల మాట్లాడుతారు రేవంత్ రెడ్డి, సీఎం మాటలు విని పరీక్షల్లో రాస్తే ఆగమైపోతరు అన్నారు. రాష్ట్రం పరువు తీస్తున్నడు ముఖ్యమంత్రి, గెలిచిన టీం కాదు, ఓడిపోయిన టీం కూడా బాగా ఆడారు…గెలుపు ఓటములు చాలా సహజం అన్నారు. భవిష్యత్తులో గెలుపు కోసం పోరాటం చేయాలి…క్రికెట్ లో హిట్ వికెట్ అవుతారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటయాన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారన్నారు.

Also Read:ఢిల్లీలో డేంజర్ బెల్స్.. మరింత క్షీణించిన గాలి నాణ్యత!

- Advertisement -