సిద్దిపేట నుండి ఖమ్మంకు నిత్యావరసర సరుకులు..

6
- Advertisement -

ఖమ్మం వరద బాధితులకు సరకులను వాహనాల ద్వారా పంపారు మాజీ మంత్రి హరీష్ రావు. ఖమ్మం, మహబూబాబాద్‌లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది.. సిద్దిపేట నుండి ఉడుత భక్తిగా సహాయం చేస్తున్నాం అని తెలిపారు హరీశ్‌. సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరు అని చెప్పారు.

మానవ సేవయే మాధవ సేవ అని అందురూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన నడుస్తుంది.. సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. ప్రభుత్వం ముందుగా మేలుకుంటే మరింత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నాం అని తెలిపారు. మా తరహాలో బీజేపీ మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలన్నారు. మేము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే మాపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారు.. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారన్నారు.ఇండ్లు నీళ్లలో మునిగిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలన్నారు హరీశ్.

Also Read:పర్యావరణ పరిరక్షణ కోసం ‘విత్తన గణపతి’: సంతోష్ కుమార్

- Advertisement -