మూసీ సమస్యలపై పాదయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు మాజీ మంత్రి హరీశ్ రావు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. ముఖ్యమంత్రి బార్లకు ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి అన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం అన్నారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి మంత్రులు, ముఖ్యమంత్రి గాలిమోటలలో తిరుగుతున్నారు అన్నారు. మూసి దురావస్థకు కారణం కాంగ్రెస్, తెలుగుదేశం పాలనే అన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మూసి నది సమస్యలపై పాదయాత్రకు తాను సిద్ధంగా ఉన్నానని…మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటికంపు ఎక్కువ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు…మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం అన్నారు. కేటీఆర్‌పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని…ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటాం అన్నారు.
Also Read:తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటారు!