పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప..పోరాడితే పోయేదేమీ లేదు రైతు బంధు వస్తది రుణమాఫీ జరుగుతదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. నర్సాపూర్ నియోజకవర్గ కుల్చారంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కెసిఆర్ రైతుల సీఎం అయితే రేవంత్ రెడ్డి బూతుల సీఎం అని మండిపడ్డారు. ఎక్కడైతే మూసిలో ఇల్లు కూలగొట్టావు అక్కడ నుంచి పాదయాత్ర చేద్దాం రా రేవంత్ రెడ్డి అన్నారు. 66 ఏండ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమే మూసి కాలుష్యం…పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగవు. రేవంత్ రెడ్డి తిట్లకు ఈ గులాబీ జెండాలు భయపడవు అన్నారు.
కచ్చితంగా రైతు భరోసా వానకాలం యాసంగి కలిపి 15000 రూపాయలు ఇవ్వాల్సిందే…కాంగ్రెస్ మంత్రులు గాలి మోటర్ లో తిరిగి రైతులను ప్రజలను గాలికి వదిలేశారు అన్నారు.రాజకీయ నాయకులకు కూడా సెన్సార్ బోర్డు ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారులు, పోలీసులు ఖబడ్దార్ మా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే వచ్చేది మా ప్రభుత్వం గుర్తించిచుకొండి..మా ప్రభుత్వం లో వడ్డీతో సహా చెల్లిస్తాం అని హెచ్చరించారు.
Also Read:జీర్ణ సమస్యలకు చెక్ పెట్టండిలా!