Harishrao: రేవంత్ సీఎం కాదు..జోకర్

5
- Advertisement -

ముఖ్యమంత్రి చిట్ చాట్ లో మాట్లాడి కుర్చీకి ఉన్న గౌరవం తగ్గించారు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన హరీశ్‌..రేవంత్ రెడ్డి మాట్లాడితే పిల్లలు చెడిపోతారు అని..ఇంట్లో తల్లిదండ్రులు టీవీ లు బంద్ చేస్తున్నారు అన్నారు. హైదరాబాద్ కి మూడు వైపులా సముద్రం ఉంది అన్నారు…గోవా పోవడం ఎందుకు హైదరాబాద్ లో ఉన్నవని అని..జోకులు వేస్తున్నారు అన్నారు. రేవంత్ సీఎం కాదు జోకర్ అన్నారు.

రాజ్యాంగ బద్ధమైన పదవీలో ఉండి మాట్లాడితే అలా మాట్లాడితే గ్రూప్ 1 రాసే వాళ్ళు పిల్లలు ఏమి అయ్యి పోవాలి….మల్లన్న సాగర్ బదితులకు ఒక్క ఇల్లు కట్టలేదని తప్పుగా మాట్లాడారు..మల్లన్న సాగర్ కి 50 వేల ఏకరాలు కాదు 17 వెల ఎకరాలు..14 ప్రభుత్వ పట్టా అసైన్డ్ భూమి 3 వేల ఎకరాలు ఫారెస్ట్ భూమి అన్నారు. 7 గ్రామాలు ముంపు కి గురి అయితే 14 గ్రామాలు ముంపుకు గురి అయ్యవని ముఖ్యమంత్రి అంటున్నారు..ముఖ్యమంత్రి ఇలా మాట్లాడితే ఎవరు నమ్మరు అన్నారు.కొడంగల్ లో ఓడి పోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు..తీసుకోకుండా ఎంపీ కి పోటీ చేశారు అన్నారు.

Also Read:బాబు వస్తే కరువు వస్తుంది: వైసీపీ ఎంపీ

- Advertisement -