రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. కొండ భూదేవి గార్డెన్ లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం సిద్దిపేటలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు..రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది బి అర్ ఎస్ ప్రభుత్వమే అన్నారు. మనం పదేళ్లు పాలించినం… వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు.. ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిందన్నారు.
సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్ కు తరలించుకు పోయాడని..వంద రోజుల్లో ఆరు గ్యారంటీ లు అని గంభీర ఉపన్యాసాలు ఇచ్చారన్నారు. ఇప్పుడు అన్నాయి నొక్కులు నొక్కుతున్నారు…రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు.. పని లేదు అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చింది..కాంగ్రెస్ మీద కోపం తో బిజెపి కి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయితదన్నారు. బీజేపీ పేదలకు, తెలంగాణకు వ్యతిరేక పార్టీ..సిలేరును లాక్కుని మనకు అన్యాయం చేసిన పార్టీ అన్నారు.
పదేళ్లలో బిజేపీ చేసిన ఒక్క మంచి పని ఉందా?,అసెంబ్లీ ఎన్నికల్లో బి అర్ ఎస్, బిజేపీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి బురజ చల్లిండ్లు.. ఇప్పుడు బడే మియ అంటుండు…కాంగ్రెస్, బిజేపీ ఒక్కటై తెలంగాణ లో బి అర్ ఎస్ లేకుండా చేయాలనే కుట్ర పన్నుతున్నారన్నారు.ఇంటికి రెండెడ్లు, నిరుద్యోగ భృతి ఇస్తానని, రైలు తెస్తానని అబద్ధాలు చెప్పి ఉప ఎన్నికల్లో గెలిచిండు.. మొన్నటి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారని…సిద్దిపేట కు అన్యాయం జరిగితే… అక్కసు వెళ్ళగట్టితే ఉరుకుందామా అన్నారు. సిద్దిపేట ప్రజలుగా చీము నెత్తురు ఉన్నోళ్ళం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు వేసి మోస పోదామా…సిద్దిపేట లో వివిధ అభివృద్ధి పనులు, రోడ్లు కు 150 కోట్లు రద్దు చేసిండన్నారు.సిద్దిపేట అభివృద్ధి ఫై కాంగ్రెస్,బీజేపీ పార్టీ లు రెండు అక్కసు వెళ్ళబుచ్చాయి….అలాంటి వారికి సిద్దిపేట లో ఓట్లు ఎట్లా వేస్తాం అన్నారు. సిద్దిపేట అంటే ప్రత్యేకత… గౌరవం ఉంది…. ఆ ప్రత్యేకతను మరో సారి చాటుకుందాం అన్నారు.
Also Read:మహేశ్ బాబు..భజే వాయు వేగం