కవిత కామెంట్స్‌పై హరీష్‌ రావు

10
- Advertisement -

కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ పై మాజీ హరీష్ రావు స్పందించారు. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు..మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని..కవిత ఏ ఉద్దేశంలో కామెంట్స్ చేసిందో ఆమెకే తెలియాలన్నారు. రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో నాడు ఉద్యమంలో, తర్వాత ప్రభుత్వంలో పార్టీకి, ప్రభుత్వంకు మంచిపేరు తెచ్చేలా తన ప్రయాణం కొనసాగిందన్నారు.

నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని… తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాల్సిన బాధ్యత నాపై ఉంది అని స్పష్టం చేశారు.

Also Read:అనిల్ అంబానీపై సీబీఐ కేసు

నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా…. నాపై, పార్టీపై కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారు అన్నారు హరీష్ రావు.

- Advertisement -