తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు.
సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచి పోతుంది అన్నారు. వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించేలా ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని సీఎంగా కేసీఆర్ నిర్ణయించారు అన్నారు.
వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించి స్వరాష్ట్రంలో పాపన్నగౌడ్ ఆశయాలను అమలు చేసింది బి ఆర్ ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు.
తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళి.
సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచి పోతుంది.
వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించేలా ఏటా వారి జయంతి, వర్ధంతి… pic.twitter.com/l6DjzbzxRF
— Harish Rao Thanneeru (@BRSHarish) August 18, 2025
Also Read:KTR:యువకుల మృతి కలిచివేసింది

