Harishrao:ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడూ?

24
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరుగుతున్నాయి. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ సమస్యలను ప్రస్తావించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆర్టీసీలో ఉద్యోగుల విలీనం ఎప్పుడు అని ప్రశ్నించారు. ఉద్యోగుల విలీనానికి జాప్యం జరగడానికి గల కారణాలు ఏంటీ? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ మేనిఫెస్టో పేజీ నెంబర్‌ 28లో ఐటెమ్‌ నంబర్‌ 14లో టీఎస్‌ ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం అని పెట్టారు కానీ ఇప్పటికి రెండు పీఆర్‌సీ బకాయిలు పెండింగ్‌లోనే ఉందని ప్రశ్నించారు. వచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తాం అని ఇంకా ఎన్ని రోజులు నాన్చుతారని ప్రశ్నించారు.ఆర్టీసీ యూనియన్‌ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు… యూనియన్‌ పునరుద్ధరణ ఎప్పటిలోగా చేస్తారు ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్న సమయంలో పిల్లలకు పర్మినెంట్‌ ఉద్యోగం ఇచ్చేవాళ్లం. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఆ పర్మినెంట్ ఉద్యోగం అనే నిబంధన తీసివేశారని దుయ్యబట్టారు.

Also Read:లండన్‌లో కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్

- Advertisement -